కాస్త ఊరట! నవంబర్లో తగ్గిన ధరలు - Retail inflation eases to 6 pc in Nov on softening food prices
close
Published : 14/12/2020 23:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాస్త ఊరట! నవంబర్లో తగ్గిన ధరలు

దిల్లీ: వినియోగదారులకు కాస్త ఊరట! నవంబర్లో తృణధాన్యాలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు కాస్త తగ్గాయి. దీంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతానికి తగ్గింది. అయితే ఆర్బీఐ నిర్దేశించుకున్న సౌకర్య స్థాయి పైనే ఉండటం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా నిర్ణయించే రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.27%, అక్టోబర్లో 7.27%గా నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్లో 9.43%, అక్టోబర్లో 11%గా ఉంది.

తృణధాన్యాల విభాగంలోని ద్రవ్యోల్బణం అక్టోబర్లోని 3.39% నుంచి 2.32 శాతానికి తగ్గింది. ఇక మాంసం, చేపల విభాగంలో 18.7 శాతం నుంచి 16.67 శాతానికి తగ్గింది. కూరగాయల్లో 22.51% నుంచి 15.63 శాతానికి చేరుకుంది. పాలు, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌తో పోలిస్తే తగ్గుదల నమోదైంది. ఇంధన ధరల ద్రవ్యోల్బణం 2.28% నుంచి 1.9 శాతానికి చేరుకుంది. మార్కెట్లు, వడ్డీరేట్లను ప్రభావితం చేసే రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతంగానే ఉంచాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్లో రిటైల్‌ ద్రవ్యోల్బణంలో తగ్గుదల నమోదవ్వడం సంతోషకరమని బీ2బీ గ్రాసరీ బిజినెస్‌ సంస్థ పీల్‌ వర్క్‌ స్థాపకులు సచిన్‌ ఛాబ్రా అన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో ఇంకా తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు విధానపరమైన రేట్లను తగ్గించేందుకు ఆర్బీఐకి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రానప్పటికీ ఆహార, ఇంధనయేతర రంగాల్లో ద్రవ్యోల్బణం నిలకడగానే ఉందని ఇండియా రేటింగ్స్‌, రీసెర్చ్‌ ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని