మూడు లక్షల ఉద్యోగాలిస్తాం: సోనూ సూద్‌ - Sonu Sood announces 3 lakhs jobs
close
Published : 31/07/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు లక్షల ఉద్యోగాలిస్తాం: సోనూ సూద్‌

పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నమన్న బాలీవుడ్‌ నటుడు

దిల్లీ: వలస కార్మికులకు ఆపన్నహస్తంగా నిలుస్తున్న ప్రముఖ నటుడు సోనూ సూద్‌... వ్యక్తిగతంగా తన పరిశీలనకు వచ్చిన వారికీ ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం నడుం బిగించిన ఆయన, నిరుద్యోగులకు మూడు లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో వలస కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో సోనూ సూద్‌ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వారికి ఉపాధి కల్పించడం కోసం ఇప్పటికే ‘ప్రవాసీ రోజ్‌గార్‌’ పేరుతో ఉద్యోగ పోర్టల్‌ను ప్రారంభించారు. తాజాగా ఈ పోర్టల్‌ ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

‘నా పుట్టినరోజు సందర్భంగా చిరు ప్రయత్నం చేస్తున్నాను. ప్రవాసీరోజ్‌గార్‌.కామ్‌ ద్వారా మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని సోనూ సూద్ ట్విటర్‌లో‌ వెల్లడించారు. ఈ సందర్భంలో తనతో కలసి పనిచేయాడానికి సిద్ధమైన సంస్థలకు సోనూ సూద్‌ ధన్యవాదాలు తెలిపారు. వీటిలో ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్, క్వెస్‌కార్ప్‌, అమెజాన్‌, సొడెక్సో వంటి సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారానే రాష్ట్రాల్లో అవసరార్థులకు ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఇదిలాఉంటే, లాక్‌డౌన్‌ సమయంలో ప్రారంభించిన సహాయ కార్యక్రమాలను సోనూసూద్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 1500 భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని