ఎస్పీబీ కోసం శబరిమలలో సంగీత సమర్పణ - Special Prayers for SP Balu
close
Published : 21/08/2020 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీబీ కోసం శబరిమలలో సంగీత సమర్పణ

శబరిమల: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఉషా పూజలతో స్వామివారికి సంగీత సమర్పణ చేసినట్టు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు వెల్లడించింది. బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆయన పేరుతో పూజలు చేసినట్టు తెలిపింది. నాద స్వరం, తబలా వంటి వాయిద్యాలతో స్వామివారి ముందు సంగీత సమర్పణ చేసినట్టు దేవస్థానం బోర్డు పేర్కొంది. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘శంకరా.. నాద శరీరా’ పాటను దేవస్థాన వాయిద్యకారులు తమదైన రీతిలో ప్రదర్శించారు. 

కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని