కరోనాతో యువ నటి మృతి - TV actress Divya Bhatnagar dies of Covid 19 at 34 in Mumbai
close
Updated : 07/12/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో యువ నటి మృతి

ముంబయి: హిందీ టెలివిజన్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ నటి దివ్యా భట్నాగర్‌ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

నవంబర్‌ 26న దివ్య అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆమెకు నిమోనియా కూడా ఉండటంతో ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తమ కుమార్తె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని గతవారమే నటి కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది.

‘యే రిష్తా క్యా కహ లాతాహై’, ‘తేరా యార్‌ యూ మై’, ‘ఉదాన్’‌, ‘విష్’‌ లాంటి కార్యక్రమాలతో దివ్య ప్రేక్షకులను అలరించారు. యువ నటి మృతితో టెలివిజన్‌ రంగం దిగ్భ్రాంతిలోకి వెళ్లింది. ఆమె మృతి పట్ల సహ నటులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు.

ఇదీ చదవండి..

యువ నటుడు వరుణ్‌ ధవన్‌కి కరోనా

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని