భారతీయ జీవన విధానం గొప్పది - World looking up to Indian ways of life amid Covid pandemic says Mohan Bhagwat
close
Published : 06/10/2020 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయ జీవన విధానం గొప్పది

జైపూర్‌ : భారతీయ జీవన విధానం చాలా గొప్పదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్ భగవత్‌ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చాలా దేశాలు కరోనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. ప్రకృతికి దగ్గరగా ఉండే భారతీయుల జీవన విధానంలోని ప్రాథమిక సూత్రాలే ఈ కరోనా కాలంలో ప్రపంచదేశాలు పాటిస్తున్నాయని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వ్యవసాయానికి ఉన్న గొప్ప లక్షణాలను సైతం వివరించారు.

యాభై ఏళ్ల కిందట భారతీయులు ప్రపంచానికి సేంద్రీయ ఎరువులను పరిచయం చేశారన్నారు. నేటికీ ప్రపంచంలో దీనికి ప్రత్యామ్నాయం లేదని మెహన్ భగవత్‌ వివరించారు. వ్యవసాయాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదే ప్రపంచాన్ని పోషిస్తుందని భగవత్‌ అన్నారు. అనుభవం, నిరూపించబడిన ఆదర్శ వ్యవసాయ పద్ధతులను మనం అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ హితం కాని పాశ్చాత్య దేశాల వ్యవసాయ పద్ధతులను మనం పాటించాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. భారతీయ వ్యవసాయానికి పది వేల సంవత్సరాల నాటి అనుభవం ఉందని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని