వ్యవసాయ రుణాల్లో రెండో స్థానంలో ఏపీ - agriculture loans ap and telangana ranked 2nd and 10th
close
Published : 26/07/2021 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవసాయ రుణాల్లో రెండో స్థానంలో ఏపీ

దిల్లీ: వ్యవసాయ రుణాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ పార్లమెంట్‌కు వివరాలు  వెల్లడించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అధిక సాగు రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ 63,22,415 ఖాతాలపై రూ.84,005.43 కోట్ల సాగు రుణం తీసుకుంది. ఒక్కో ఖాతాపై సగటున రూ.1,32,869 కోట్ల వ్యవసాయ రుణం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇక ఏపీలో మార్చి 31 నాటికి రూ.1,69,322 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఏపీలోని ఒక్కో ఖాతాపై సగటున రూ.1,41,004 రుణం ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని