బచ్చన్‌ పాండే వచ్చాడు - akshay kumar bachchan pandey shooting starts
close
Published : 08/01/2021 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బచ్చన్‌ పాండే వచ్చాడు

ముంబయి: అక్షయ్‌కుమార్‌ తీరిక లేకుండా సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాల కోసం సిద్ధమవడం ఆయనకు అలవాటు. కొన్ని రోజుల క్రితమే ‘బెల్‌బాటమ్‌’ చిత్రీకరణను పూర్తి చేశారు. ఆ తర్వాత ‘అంతరంగీ రే’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు ‘బచ్చన్‌ పాండే’ కోసం సెట్లోకి అడుగుపెట్టారు.

అక్షయ్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాతగా అక్షయ్‌ నటిస్తున్న పదో చిత్రమిది. తాజాగా ఈ సినిమా సెట్లో తన గెటప్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు అక్షయ్‌.

‘‘కొత్త సంవత్సరం..పాత కలయికలు...‘బచ్చన్‌పాండే చిత్రీకరణ మొదలైంది. నా కొత్త లుక్‌పై మీ అభిప్రాయాలతో మీ శుభాకాంక్షలు కూడా అందించండి’’అని ట్వీట్‌ చేశారు. ఫర్హాద్‌ శామ్‌జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్, కృతి సనన్, అర్షద్‌ వార్షి తదితరులు నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని