‘పృథ్వీరాజ్ రాసో’ కవితాధారంగా అక్షయ్‌ చిత్రం - akshay prithviraj to be based on an epic poem by chand bardai
close
Published : 25/04/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పృథ్వీరాజ్ రాసో’ కవితాధారంగా అక్షయ్‌ చిత్రం

ఇంటర్నెట్ డెస్క్: వైవిధ్య నటుడు అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితంపై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథను కవి చంద్ బర్దాయ్ రచించిన ‘పృథ్వీరాజ్ రాసో’ కవిత ఆధారంగా సినిమా తీర్చిదిద్దుతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కవి గురించి దర్శకుడు చంద్రప్రకాష్‌ స్పందిస్తూ..‘‘పృథ్వీరాజ్ కథ ప్రధానంగా మధ్యయుగ సాహిత్యం మీద ఆధారపడింది. కవి చంద్ బర్దాయ్ రచించిన ‘పృథ్వీరాజ్ రాసో’ కవిత. ఇందులో పృథ్వీరాజ్, అతని జీవితం, ఇతర విషయాలపై అనేక ఇతర సాహిత్య రచనలు ఉన్నాయి. వీటితో పాటు, రాసోపై చేసిన కొన్ని వ్యాఖ్యానాలు సైతం కూడా ఉన్నాయని’’ తెలిపారు.

‘‘మనేదేశంలోని గొప్ప యోధుల గురించి  చెప్పడం. కథతో పాటు కళ, పురావస్తు శాస్త్రం ఆనాటి పరిస్థితులను భౌతిక సంస్కృతిని పరిశోధించడం అంటే నాకు చాలా ఇష్టం. మరో మాటలో చెప్పాలంటే వెండితెరపై ఇలాంటి గొప్పవాళ్ల జీవితాలను చిత్రించడానికి ఇష్టపడే ఓ కళాకారుడిగా నాకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని’’ తెలిపారు.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ భార్య పాత్రలో మాజీ మిస్‌వరల్డ్‌ మానుషి చిల్లర్‌ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి చిత్రం. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో సోనూసూద్‌ - కవి చాంద్‌ బర్దాయ్ పాత్రలో నటిస్తుండగా సంజయ్‌ దత్‌, అశుతోష్‌ రానా, మాన్వ్ విజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్‌-ఇషాన్‌-లాయ్‌లు సంగీత స్వరాలు అందిస్తుండగా నమ్రతరావు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని