AP Corona: 22వేలు దాటిన రోజువారీ కేసులు - ap corona latest update
close
Updated : 20/05/2021 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Corona: 22వేలు దాటిన రోజువారీ కేసులు

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 22 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,01,281 నమూనాలను పరీక్షించగా 22,610 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. మరోవైపు తాజాగా 114 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా మొత్తం మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 23,098 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.

తూర్పుగోదావరిలో 17 మంది, చిత్తూరులో 15 మంది,  తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం  జిల్లాల్లో 10 మంది, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 9 మంది, కృష్ణ జిల్లాలో 8 మంది, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని