ఇంట్లో ఒకలా... బయట మరోలా...! - corona virus spread spl news
close
Published : 04/03/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లో ఒకలా... బయట మరోలా...!

వైరస్‌ వ్యాప్తి ముప్పుపై తాజా విశ్లేషణ

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ఇప్పటికీ జవాబుల్లేని ప్రశ్నలెన్నో! ఒకరి నుంచి మరొకరికి ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తుందనే విషయమై నిపుణులు రకరకాల అంచనాలు వేసి, ప్రపంచ ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. అయితే... తాజా అధ్యయనమొకటి ఈ వైరస్‌ పరిమాణాన్ని బట్టి దాని వ్యాప్తిని అంచనా వేయవచ్చని సూచించింది. మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం, చీదడంతో పాటు నిశ్వాస ద్వారా... వైరస్‌లు గాలిలో ప్రయాణించి ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ఇదివరకే నిపుణులు వెల్లడించారు. కానీ, ఇవి ఎంతదూరం ప్రయాణిస్తాయి? ఇళ్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వీటి సంక్రమణ తీరు ఎలా ఉంటుందన్నది మాత్రం అస్పష్టంగానే మిగిలిపోయాయి! అయితే, గాలి తుంపరల (ఏరోసోల్‌) శాస్త్రవేత్త టమీ బాండ్‌ ఈ విషయాలపై ఇటీవల అధ్యయనం సాగించారు. కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందంతో కలిసి లోతుగా విశ్లేషించారు. ‘ఎఫెక్టివ్‌ రీ-బ్రీథ్డ్‌ వాల్యూమ్‌’ టూల్‌ కిట్‌ ఆధారంగా వైరస్‌ పార్టికల్స్‌ ప్రయాణించే తీరును వివరించారు.

పరిమాణాన్ని బట్టి ప్రయాణం...

‘‘కాలుష్య కణాల మాదిరే వైరస్‌లు కూడా నీటి తుంపర్లతో కలిసి గాలిలో ప్రయాణిస్తాయి. అయితే పరిమాణాన్ని బట్టి వాటి ప్రయాణదూరం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 1 మైక్రాన్, 10 మైక్రాన్లు, 100 మైక్రాన్ల చొప్పున తుంపర్ల పరిమాణాన్ని లెక్కగట్టాం. వీటితో పాటు అంతర్గత, బాహ్య పరిస్థితులు, పరిసరాలు, గాలి వీయడం వంటి అంశాల ఆధారంగా అవి ప్రయాణిస్తాయి. కరోనా బాధితుడి నుంచి వెలువడే వైరస్‌ పార్టికల్స్‌... ఇళ్లలో ఒకలా, బహిరంగ ప్రదేశాల్లో మరోలా వెళ్తాయి. గదుల్లోనైతే ఈ ఏరోసోల్స్‌ ఆరు అడుగుల దూరం కూడా ప్రయాణించగలవు. దీంతో గాలి ఎక్కువగా వీచే చోట, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం మంచిదని కొంతమంది భావిస్తున్నారు. అయితే... దీనికి కూడా స్పష్టమైన ఆధారాల్లేవు. ఎఫెక్టివ్‌ రీ-బ్రీథ్డ్‌ వాల్యూమ్‌ విధానాన్ని ఉపయోగించి వివిధ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి ముప్పు ఎలా ఉంటుందన్నది అంచనా వేయవచ్చు’’ అని టమీ బాండ్‌ పేర్కొన్నారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని