coronavaccine: నెలకు ఎన్ని డోసులు ఉత్పత్తి? - do you know how many vaccine doses are coming out in india monthly acoording to govt data
close
Updated : 24/05/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

coronavaccine: నెలకు ఎన్ని డోసులు ఉత్పత్తి?

తిరువనంతపురం: భారత్‌లో నెలకు 8.5 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయని కేరళ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే రోజుకి సగటున 12-13 లక్షల డోసులు ప్రజలకు అందజేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఆయా రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లను ఎప్పటిలోగా అందజేయాలనే విషయంలో ఎలాంటి నిర్ధిష్టమైన లక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి నెలకు 6.5 కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ నుంచి 2 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించింది. 

దేశంలో అందుబాటులోకి వచ్చిన మూడు టీకాల ఉత్పత్తి రానున్న రెండు నెలల్లో గణనీయంగా పెరగనుందని హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం తెలిపింది. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ తమ తయారీ సామర్థ్యాన్ని నెలకు 5 కోట్ల నుంచి 6.5 కోట్లకు పెంచినట్లు గుర్తుచేసింది. జులై నాటికి దీన్ని మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొంది. ఇక భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకా తయారీని 90 లక్షల నుంచి 2 కోట్ల డోసులకు పెంచినట్లు తెలిపింది. దీన్ని రానున్న కొన్ని నెలల్లో 5 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పింది. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన మూడో టీకా స్పుత్నిక్‌-వి సామర్థ్యాన్ని 30 లక్షల నుంచి 1.2 కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ల ధరపై కఠినమైన నియంత్రణలు విధించడం వల్ల సరిపడా టీకాలు అనుకున్న సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిపింది.

అయితే, కేంద్రం తెలిపినట్లుగా నెలకు 8.5 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. రోజుకి సగటున 28.33 లక్షల డోసులు తయారవుతున్నాయి. కానీ, రోజుకి సగటున 12-13 లక్షల డోసులు మాత్రమే ప్రజలకు అందజేస్తున్నామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన చూస్తే రోజూ ఉత్పత్తి అవుతున్న మొత్తం డోసుల్లో దాదాపు సగం మాత్రమే ప్రజలకు అందుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని