పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ - ec green signal to prc announcement
close
Updated : 21/03/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది.

దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని.. ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ లేఖ రాశారు. ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ నేపథ్యంలో పీఆర్సీని రేపు ప్రకటించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ దాదాపు 30శాతానికి అటుఇటుగా ఉండొచ్చని సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని