ట్రంప్‌నకు రెహ్మాన్‌ కృతజ్ఞతలు
close
Updated : 27/02/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌నకు రెహ్మాన్‌ కృతజ్ఞతలు

రెహ్మాన్‌ సెల్ఫీ

కోడంబాక్కం : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యటనలో భాగంగా ట్రంప్‌ దంపతులకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఆస్కార్‌ నాయకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ట్రంప్‌కు రెహ్మాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీని ఏఆర్‌ రెహ్మాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగ్ర దేశాధినేతకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని