ఆ మూడు చిత్రాలు ఓటీటీలోనేనా?
close
Published : 29/06/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మూడు చిత్రాలు ఓటీటీలోనేనా?

ముంబయి: వేసవి సీజన్‌ అంటే వినోదాలకు కేంద్రం. వారానికొక కొత్త సినిమాతో సందడిగా ఉండేది. అలాంటిది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వినోద పరిశ్రమ పూర్తిగా మూతబడిపోయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత నెమ్మదిగా సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాల పరిస్థితి ఏంటి? కొందరు దర్శక-నిర్మాతలు థియేటర్‌లలోనే సినిమా విడుదల చేస్తామని భీష్మించుకుని కూర్చోగా, మరికొందరు మాత్రం ఓటీటీల వైపు చూస్తున్నారు. 

ఇందులో భాగంగా బాలీవుడ్‌ చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నాయి. సుశాంత్‌ సింగ్‌ ‘దిల్‌ బెచారా’ డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించగా, ఈ వరుసలో అక్షయ్‌కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’, అజయ్‌ దేవ్‌గణ్‌ ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’, ఆలియాభట్‌ ‘సడక్‌2’లు కూడా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానున్నాయని బాలీవుడ్‌ టాక్‌. ‘బాలీవుడ్‌ కి హోం డెలివరీ’ కార్యక్రమంలో భాగంగా అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆలియాభట్‌, వరుణ్‌ధావన్‌లతో పాటు, వాల్‌డిస్నీ, స్టార్‌ డిస్నీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌ శంకర్‌లు వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిర్వహిస్తుండటంతో ఈ ప్రచారం ఊపందుకుంది. మరి ఈ మేరకు ప్రకటన చేస్తారా? లేదా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని