అప్పుడే కెమెరాతో ప్రేమలో పడ్డా
‘‘నటిగా ఫలానా పాత్రలే చేయాలని పరిమితులేమీ పెట్టుకోలేదు. అన్ని రకాల జానర్లలో నటించాలనుంది. విభిన్న రకాల పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ చిత్రంతో వెండితెరపై మెరవనున్న తెలుగు అందం ఆమె. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్ దర్శకుడు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ఫరియా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఇక్కడే లయోలా కాలేజీలో మాస్ కమ్యునికేషన్ చేశా. కానీ, నాకు తెలుగు రాదు. సినిమాల్లోకి వచ్చాకే.. తెలుగు మాట్లాడటం నేర్చుకున్నా. నాకు మొదటి నుంచీ నటనతో పాటు ఆర్ట్‌కి సంబంధించిన అన్ని విషయాలపైనా ఆసక్తి ఉండేది. సంగీతం నేర్చుకున్నా. పెయింటింగ్‌లో శిక్షణ తీసుకున్నా. మోడలింగ్ చేశా. ఏడేళ్ల పాటు థియేటర్ ఆర్ట్స్ చేశా. రంగస్థల నటిగా స్థిరపడాలనిపించింది’’.
* ‘‘నేనిప్పటి వరకు 50వరకు స్టేజ్ షోలు చేశా. కాలేజీ రోజుల్లో ‘నక్షత్ర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించా. ఆ సిరీస్ చేసేటప్పుడే తొలిసారి కెమెరాతో ప్రేమలో పడ్డా. ఆ తర్వాతే చిత్రసీమలోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నా. నేను లయోలా చదువుతున్న రోజుల్లో.. కాలేజీలో జరిగిన ఓ వేడుకకి దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడే మాకు తెలిసిన వాళ్లు ఒకరు నన్ను ఆయనకి పరిచయం చేశారు. తర్వాత నా గురించి అడిగితే.. అన్ని విషయాలు చెప్పా. అప్పటి నుంచి నేను ఆయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించడం మొదలు పెట్టా. ఈ క్రమంలోనే ఈ చిత్రం గురించి తెలుసుకొని.. ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అందులో నా నటన నచ్చడంతో ఈ చిత్రంలో అవకాశమిచ్చారు’’.
‘‘జాతిరత్నాలు’.. ప్రస్తుత సమాజంపై తీసిన ఓ వ్యంగ్యాత్మక చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. దీంట్లో నేను చిట్టి అనే అమ్మాయిగా కనిపిస్తా. నేను ముగ్గురి జీవితాల్లోకి వచ్చాకే... కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మరి అదేంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’. దక్షిణాదిలో నాకిష్టమైన నటుడు ఫహద్ ఫజిల్. ఓ చక్కటి సైకో పాత్ర చేయాలన్నది నా కల’’.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా