PushpakaVimanam: ఒకటయ్యే వేళనా.. వైభోగం - Kalyanam Lyrical Song
close
Updated : 19/06/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PushpakaVimanam: ఒకటయ్యే వేళనా.. వైభోగం

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. గీత్‌ సైని కథానాయిక. రామ్‌ మిరియాల స్వరాలందించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నటి సమంత ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. నాయకానాయికల పెళ్లి వేడుక నేపథ్యంలో వచ్చే పాట ఇది. ‘కల్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ గీతానికి కాసర్ల శ్యాం సాహిత్యమందించగా.. సిద్‌ శ్రీరామ్‌, మంగ్లీ ఆలపించారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. వినసొంపైన పాటలు.. ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం అలరిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: హెస్టిన్‌ జోస్‌ జోసెఫ్‌.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని