సర్కారు నోటీస్‌
close
Published : 30/07/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్కారు నోటీస్‌

‘సర్కారు వారి పాట’ నుంచి సినీప్రియులకు కొత్త కబురు అందింది. ఫస్ట్‌ నోటీస్‌ పేరుతో ఈనెల 31న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తిసురేష్‌ నాయిక. శనివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ నోటీస్‌ పేరుతో మహేష్‌ లుక్‌ ఒకటి విడుదల కానుంది. దీనికి సంబంధించి గురువారం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్‌ చేతిలో ఓ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో కొన్ని బైకులు, కార్లతో పాటు కొందరు రౌడీలు కనిపించారు. దీన్ని బట్టి ఇదొక యాక్షన్‌ ఎపిసోడ్‌లోని పోస్టర్‌ అని అర్థమవుతోంది. ‘‘ఇప్పటి వరకు చూడని సరికొత్త అవతారంలో సూపర్‌స్టార్‌’’ అంటూ ఆ ప్రచార చిత్రానికి ఓ వ్యాఖ్యను జోడించారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని