యాక్షన్‌ ‘హిడింబ’
close
Published : 02/08/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్షన్‌ ‘హిడింబ’

శ్విన్‌ బాబు కథానాయకుడిగా అనీల్‌ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. నందితా శ్వేత కథానాయిక. ఈ సినిమాకి ‘హిడింబ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆదివారం అశ్విన్‌  పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అశ్విన్‌ తలపై గాయంతో.. చేతిలో ఇనుప చువ్వ పట్టుకుని యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లుగా కనిపించారు.   ‘‘ఇతిహాసాల్లో శక్తిమంతమైన రాక్షసరాజు పేరే హిడింబ. కథాంశానికి తగ్గట్లుగా ఉంటుందని ఆ పేరునే టైటిల్‌గా ఖరారు చేశాం. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అశ్విన్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: వికాస్‌ బడిసా, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని