కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ తొలిపాట చూశారా?
close
Published : 07/02/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ తొలిపాట చూశారా?

హైదరాబాద్‌: ‘మహానటి’ తర్వాత వరుస గ్లామర్‌ పాత్రలతో అలరించిన కీర్తి సురేశ్‌.. మళ్లీ నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమె కీలక పాత్రలో నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న సినిమాలోని ‘కొత్తగా.. కొత్తగా..’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ‘మహానటి’ కోసం కాస్త లావుగా మారిన కీర్తిసురేశ్‌ తాజా చిత్రంలో చాలా సన్నగా కనిపించారు. ఇటీవల ఆమె విడుదల చేసిన ఫొటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. 

తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్‌, తమన్‌ ఆలపించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ‘మిస్‌ ఇండియా’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌.కోనేరు నిర్మాత వ్యవహరిస్తున్నారు.

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని