100మంది చిన్నారులతో సూర్య ఫ్లైట్‌ జర్నీ
close
Published : 13/02/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100మంది చిన్నారులతో సూర్య ఫ్లైట్‌ జర్నీ

‘ఆకాశమే నీ హద్దురా’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

చెన్నై: కోలీవుడ్‌ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధా కె.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘పిల్ల పులి’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ పాట విడుదల కార్యక్రమం ఎంతో విభిన్నంగా జరిగింది.

నిరుపేద విద్యార్థులకు సాయం చేయడమే లక్ష్యంగా సూర్య ‘అగరం’ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘అగరం’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల కొంతమంది పేద విద్యార్థులకు.. ‘మీ కలలను ఎలా సాకారం చేసుకోవాలనుకుంటున్నారు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరిలో మెప్పించేలా రాసిన 100 మంది చిన్నారులను ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారందరితో కలిసి సూర్య విమానంలో ప్రయాణం చేశారు. పిల్లల సందడి మధ్య ‘ఆకాశమే హద్దురా’ ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని