నితిన్‌ ‘భీష్మ’ ట్రైలర్‌ చూశారా?
close
Updated : 17/02/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌ ‘భీష్మ’ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీష్మ’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలై టీజర్‌తో పాటు వాట్‌ ఏ బ్యూటీ, సింగిల్‌ యాంథమ్‌ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కాగా, తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ మరింత ఆకట్టుకుంటోంది. 

‘దుర్యోధనుడు.. దుశ్శాసన.. ధర్మరాజు.. యమధర్మరాజు.. శని.. శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు’ అంటూ నితిన్‌ డైలాగ్‌లతో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. వ్యవసాయం నేపథ్యంలో సాగుతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని