‘ప్రీతి’ మిస్సింగ్‌.. ఛార్జ్‌ తీసుకున్న విక్రమ్‌  
close
Published : 19/02/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రీతి’ మిస్సింగ్‌.. ఛార్జ్‌ తీసుకున్న విక్రమ్‌  

‘హిట్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: పబ్‌లో స్నేహితులతో సరదాగా గడిపిన ప్రీతి అనే అమ్మాయి.. ఆ తర్వాత రోజు నేషనల్‌ హైవేపై కనిపించింది. అర్ధరాత్రి అయినా ప్రీతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్‌ కట్‌ చేస్తే ప్రీతి మిస్సింగ్‌. ఇప్పుడు ఈ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి విశ్వక్‌సేన్‌ అలియాస్‌ విక్రమ్‌ రుద్రరాజు ఛార్జ్‌ తీసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హిట్‌’. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నేచురల్‌ స్టార్‌ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శైలేశ్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన తరుణంలో తాజాగా ‘హిట్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.  

విక్రమ్‌ రుద్రరాజు అలియాస్‌ విక్రమ్‌ అనే పోలీస్‌ పాత్రలో విశ్వక్‌సేన్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘నీ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న విషయాలు.. నీకు నీ పాస్ట్‌ను గుర్తు చేస్తున్నాయి విక్రమ్‌. అందుకే ఈ పానిక్‌ ఎటాక్స్‌. ఇవన్నీ’ అనే డైలాగ్‌ బట్టి చూస్తుంటే ప్రీతి కథతోపాటు ఇందులో మరొక కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతి మిస్సింగ్‌ను పరిష్కరించే సమయంలో విశ్వక్‌సేన్‌కు ఎదురయ్యే సమస్యలేంటి.. వాటన్నింటినీ ఎదుర్కొని ఆయన ప్రీతిని కనిపెట్టారా అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 28 వరకూ వేచి చూడాల్సిందే.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని