ఓ తల్లి పీడకల నిజమైతే..!
close
Published : 08/06/2020 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ తల్లి పీడకల నిజమైతే..!

ఉత్కంఠగా ‘పెంగ్విన్‌’ టీజర్‌

హైదరాబాద్‌: కథానాయిక కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’ సినిమా తెలుగు టీజర్‌ను సమంత విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో టీజర్‌ను రూపొందించారు. అపహరణకు గురైన తన కుమారుడి ఆచూకీ కోసం కీర్తి సురేశ్‌ పడే వేదన చుట్టూ సాగే చిత్రం ఇది. ‘మీ అందరి కథ వెనుక.. ఓ అమ్మ కథ ఉంది. మీ ప్రయాణం మొదలైంది ఆమె నుంచే..’ అని టీజర్‌లో చూపించారు. చివరిలో జోకర్‌ వేషంలో ఉన్న ఓ వ్యక్తి గొడ్డలితో ఎవర్నో నరుకుతూ కనిపించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. తమిళ టీజర్‌ను త్రిష, మలయాళ టీజర్‌ను మంజూ వారియర్‌ విడుదల చేశారు.

‘పెంగ్విన్‌’ చిత్రానికి ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించారు. కార్తికేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరాం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్‌ 11న విడుదల చేయబోతున్నారు. జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుల కాబోతోంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని