‘చందమామ’ మైనపు బొమ్మను చూశారా..!!
close
Updated : 05/02/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చందమామ’ మైనపు బొమ్మను చూశారా..!!

నెటిజన్లను ఆకట్టుకున్న పంచదార బొమ్మ

సింగపూర్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాజల్‌ మైనపు విగ్రహాం కొలువుదీరింది. ఈ మేరకు సింగపూర్‌కు చేరుకున్న కాజల్ బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో ఉన్న కాజల్‌ మైనపు బొమ్మ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాజల్‌ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్‌ నటిస్తున్నారు.  దీంతోపాటు శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌2’ సినిమాలో కాజల్‌ సందడి చేయనున్నారు. హిందీలో ‘ముంబయిసాగా’లో నటించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని