తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గం
close
Updated : 21/01/2020 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గం

సీఏఏ రద్దు కోసం ఉద్ధృతంగా పోరాడతాం: ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేసే వరకు పోరాడతామని, ఈ క్రమంలో తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గేది లేదని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. యంగ్‌ ఇండియా సమన్వయ కమిటీ హైదరాబాద్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోది రాజనీతిశాస్త్రంలో పట్టభద్రుడని చెబుతారే తప్ప ఏనాడు పట్టా కాగితం చూపించలేదని విమర్శించారు. ప్రజలను మాత్రం ధ్రువీకరణపత్రాలు చూపించాలని దబాయిస్తున్నారన్నారు. సియాసత్‌ దినపత్రిక సంపాదకుడు అమీర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. సీఏఏపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. బహిరంగసభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, విశ్వేశ్వర్‌రావు,  పలు సంఘాల నేతలు మాట్లాడారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని