‘ప్రలోభాలకు లొంగకపోవడంతోనే మండలి రద్దు’
close
Updated : 27/01/2020 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రలోభాలకు లొంగకపోవడంతోనే మండలి రద్దు’

అమరావతి: వికేంద్రీకరణ బిల్లు నెగ్గించుకోవడం కోసం తెదేపా ఎమ్మెల్సీలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని తెదేపా ఎమ్మెల్సీలు ఆరోపించారు. బిల్లులు పాస్‌ అయ్యేందుకు అనేక రకాలుగా ప్రయత్నించి.. కుదరకపోవడంతో మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎవరైనా ప్రలోభాలకు లొంగుతారని భావించే మూడు రోజుల పాటు వేచి చూశారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మండలి రద్దు నిర్ణయంపై తెదేపా ఎమ్మెల్సీలు సోమవారం మీడియాతో మాట్లాడారు.

శాసన మండలిలో ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలను చర్చించామని తెదేపా ఎమ్మెల్సీలు అన్నారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడమంటే ప్రజాభిప్రాయం కోరడమేనని, అంతమాత్రన ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా, అభివృద్ధిని మండలి అడ్డుకోవడం ఇప్పుడే కనిపించిందా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మండలిలో ఉన్న ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మె్ల్సీల రాజీనామా ఎందుకు కోరలేదని నిలదీశారు. రాజధాని బిల్లును బూచిగా చూపించి మండలిని రద్దు చేయడం తగదన్నారు. మండలి రద్దుతోనే వైకాపా ప్రభుత్వం రద్దుకు బాటలు పడ్డాయని వ్యాఖ్యానించారు. బలం ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని హితవు పలికారు. శాసనమండలి రద్దుతో వైకాపా నేతలు కూడా ఆందోళనలో ఉన్నారన్నారు. విశాఖ ప్రజలు కూడా రాజధాని కోరడం లేదని, చంద్రబాబుకు పేరు వస్తుందనే అసూయతోనే రాజధాని మారుస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని