రాజధాని అంశంపై స్పందించిన ఉండవల్లి
close
Published : 07/02/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని అంశంపై స్పందించిన ఉండవల్లి

రాజమహేంద్రవరం: ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ర్టంలో పెట్టుబడులు ఎవరు పెడతారని.. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ మూడు రాజధానుల అంశం లేదని.. ఇక్కడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. రాజధాని రైతుల దృష్టిలో తమను నష్టపరిచిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచారని ఉండవల్లి ఆక్షేపించారు.

పదేళ్లలో విశాఖను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పడం సరికాదన్నారు. హైదరాబాద్‌ను అలానే చేసి నష్టపోయామని చెప్పారు. 60శాతానికి పైగా ధనవంతులు ఉన్న రాష్ట్రంగా పంజాబ్ గుర్తింపు పొందిందని.. అక్కడి నగరాల్లో 10 లక్షలకు మించి జనాభా ఉండదన్నారు. పోలవరం నిర్మాణ పనులు సరిగా జరగడం లేదని ఉండవల్లి ఆరోపించారు. ప్రత్యేకహోదా సాధ్యం కాకపోతే  రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా పన్ను రాయితీలైనా ఇవ్వాల్సిన అవసరముందని.. అలాంటప్పుడే ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని