రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారు: కోమటిరెడ్డి
close
Updated : 01/03/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారు: కోమటిరెడ్డి

నకిరేకల్‌: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపలేకపోయారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రైతన్నను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి కేసీఆర్‌ నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారని, పేద ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్లు వచ్చి అడిగినా.. సాయం చేశామని గుర్తు చేశారు. 

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. అక్రమంగా మున్సిపల్‌ ఛైర్మన్‌లను గెలుచుకున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం వల్లే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, ఆ నిధులన్నింటినీ సీఎం కేసీఆర్‌ దోచుకున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కేతేపల్లిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని