తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు 
close
Updated : 26/06/2020 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు 

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ రోజు 78 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,766కు చేరుకుంది. ప్రస్తుతం 7,436 మంది కరోనాతో పోరాడుతున్నారు. 24 గంటల్లో 4,374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు. 


ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 774 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌లో 20, మెదక్‌లో 9, ఆదిలాబాద్‌లో 7, నాగర్‌కర్నూల్‌లో 6, నిజామాబాద్‌లో 6, రాజన్న సిరిసిల్లాలో 6, సిద్దిపేటలో 3, ములుగులో 2, వికారాబాద్‌లో 1, మహబూబ్‌నగర్‌లో 1, జగిత్యాలలో 2, జయశంకర్‌ భూపాలపల్లిలో 3, ఖమ్మంలో 3, యాదాద్రి భువనగిరిలో 2, మిర్యాలగూడలో 1 కేసులు నమోదు అయ్యాయి.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని