HYD: రాత్రి 7వరకే మందుల దుకాణాలు
close
Published : 28/06/2020 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: రాత్రి 7వరకే మందుల దుకాణాలు

హైదరాబాద్‌ పశ్చిమ మండల ఔషధ దుకాణాల నిర్ణయం

హైదరాబాద్‌: నగరంలో రాత్రి ఏడు గంటల వరకే మందుల దుకాణాలు తెరవాలని హైదరాబాద్‌ పశ్చిమ మండల ఔషధ దుకాణాల అసోసియేషన్‌ నిర్ణయించింది. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున అసోసియేషన్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయాన్ని చర్చించారు.  వివిధ ఔషధ దుకాణాల్లో పని చేస్తున్న ఫార్మాసిస్టులకు ఇప్పటికే కరోనా సోకిన విషయమూ భేటీలో చర్చకొచ్చింది. దీంతో నగరంలో రాత్రి 7 గంటలకే మందుల దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 15వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. 

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో వారంపాటు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేయాలని దుకాణాల యజమానుల సంఘం నిర్ణయిచింది. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, బేగం బజార్‌, కోఠి ట్రూప్‌ బజార్‌, పాతబస్తీ లాడ్‌ బజార్‌లో ఎనిమిది రోజులపాటు దుకాణాలు మూసివేస్తారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని