తెలంగాణలో కరోనా @ 975
close
Updated : 29/06/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కరోనా @ 975

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొ్తం 2648 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 975 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 1673 కేసులు నెగెటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 15394కి చేరింది. 

కొత్తగా మరో ఆరు మరణాలు
రాష్ట్రంలో కొత్తగా ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 253కి పెరిగింది. అలాగే, ఈ ఒక్క రోజే 410 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5582కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలోనే 861
గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కేసులు రోజురోజుకీ ఉద్ధృతమవుతుండటం కలవరపెడుతోంది. ఈ రోజు  861 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ రోజు అత్యధికంగా రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల్ని పరిశీలిస్తే..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని