అయోధ్య నుంచి బీఎస్పీ ఎన్నికల ప్రచార అడుగులు
close
Published : 24/07/2021 05:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయోధ్య నుంచి బీఎస్పీ ఎన్నికల ప్రచార అడుగులు

 జ్ఞానోదయ సమ్మేళనాల పేరుతో సభలు

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శుక్రవారం బ్రాహ్మణ సమావేశాలు నిర్వహించడం ద్వారా బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) 2022 ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. ఈ సమావేశాల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మిశ్రా ఇతర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బ్రాహ్మణ సమాజాన్ని తమ పార్టీ వైపు మళ్లించుకునేందుకు ఎన్నికలకు ఏడు నెలల ముందుగానే సమావేశాల పేరిట ప్రచారం ప్రారంభించారు. అయోధ్యలో ప్రారంభమైన ఈ సమ్మేళనాలను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించనున్నారు. మాయావతి దృష్టి అంతా సంప్రదాయ ఓట్లతో పాటు బ్రాహ్మణ ఓట్లపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు ‘బ్రాహ్మణ సమ్మేళన్‌’ అని పేరుతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నట్లు సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయన్న కారణంతో ఈ సమావేశాలకు ‘జ్ఞానోదయ సమ్మేళనాలు’గా పేరు మార్చారు. బ్రాహ్మణ వర్గ ప్రతినిధి అయిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మిశ్రా ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తొలి సమావేశం అయోధ్యలో నిర్వహించారు. ఈ సమ్మేళనాలను తొలివిడతగా ఆరు జిల్లాల్లో నిర్వహిస్తామని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని సతీష్‌ చంద్ర మిశ్రా తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని