ఆ అడవిలో మహిళా గైడ్స్‌!
close
Published : 09/03/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ అడవిలో మహిళా గైడ్స్‌!

పులుల సంరక్షణకు పేరుగాంచిన కన్హా నేషనల్‌ పార్కు అది. ప్రకృతి అందాలతో అలరారే ఆ అటవీ ప్రాంతాన్ని చుట్టేసిరావాలని పర్యటకులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ సౌందర్యం వెనుక ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటి చోట ధైర్యసాహసాలతో సుమారు 13 మంది మహిళలు గైడ్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీరంతా 25 నుంచి 35 ఏళ్లలోపువారే కావడం విశేషం. వారిలో రేష్మ ఒకరు. ‘మాది బాలాఘాట్‌ ముక్కీ గ్రామం. ఇది టైగర్‌ రిజర్వు ప్రాంతం. చిన్నప్పటి నుంచీ వన్యమృగాల అరుపులు వింటూ పెరిగాం. పక్షుల శబ్దాలు, పులుల అడుగు జాడల ఆధారంగా వాటి రాకను గుర్తించగలం. ఇదే మాకు అదనపు నైపుణ్యం కూడా. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చే పర్యటకులకు మా ప్రాంతం చూపించడం అంటే నాకిష్టం. అందుకే ఈ రంగంపై ఆసక్తి పెరిగింది’ అంటోంది రేష్మా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని