INDvsENG: కోహ్లీసేన 5-0తో స్వీప్‌ చేయగలదు! - india can clean sweep england if there are turning pitches
close
Published : 22/05/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: కోహ్లీసేన 5-0తో స్వీప్‌ చేయగలదు!

టర్నింగ్‌ పిచ్‌లైతేనే అవకాశమన్న మాంటీ పనేసర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో టర్నింగ్‌ పిచ్‌లుంటే టీమ్‌ ఇండియా చెలరేగుతుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అంటున్నాడు. వాతావరణం వేడిగా ఉంటే 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసినా ఆశ్చర్యం లేదని అంచనా వేశాడు. ఆగస్టులో ఇంగ్లాండ్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయని, బంతి స్వింగయ్యే అవకాశం తక్కువని పేర్కొన్నాడు. ఈ మేరకు అతడో ట్వీట్‌ చేశాడు.

జూన్‌లో కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటించే సంగతి తెలిసిందే. మొదట న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ ఫైనల్స్‌లో తలపడుతుంది. ఆపై నెల రోజుల విరామం తర్వాత రూట్‌ సేనతో ఐదు టెస్టులు ఆడుతుంది. ఇవన్నీ ఆగస్టు, సెప్టెంబర్‌లో జరుగుతాయి. అదే సమయంలో బ్రిటన్‌లో వేసవి కాలం ఉంటుంది. వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు స్పిన్‌కు అనుకూలిస్తాయి.

‘ఐదు టెస్టులు ఆగస్టులో జరుగుతాయి. అప్పుడు వాతావరణం వేడిగా ఉంటుంది. టీమ్‌ఇండియా స్పిన్నర్లు ఆటపై పట్టు బిగిస్తారు. అదే జరిగితే కోహ్లీసేన  5-0తో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది’ అని మాంటీ ట్వీట్‌ చేశాడు. అయితే కొంతమంది నెటిజన్లు అతడి ట్వీట్‌ను జోక్‌గా వర్ణించారు. ‘సీమ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో భారత్‌ ఆడటం కష్టం. 5-0తో స్వీప్‌ ఒక జోక్‌’ అని ఒకరు బదులిచ్చారు.

‘ఆగస్టులో బంతి సీమ్‌ అవ్వగలదా? ఏటా ఆ సమయంలో బంతి స్పిన్‌ అవుతుంటుంది. ఒకవేళ పిచ్‌లు ఆగస్టులో స్పిన్‌కు అనుకూలిస్తే  టీమ్‌ఇండియాకు కచ్చితంగా అవకాశం ఉంటుంది’ అని మాంటీ స్పందించాడు. అయితే న్యూజిలాండ్‌తో టెస్టులకు పచ్చికతో కూడిన పిచ్‌లు రూపొందిస్తే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బలాబలాలు తెలిసే అవకాశం ఉంటుందన్నాడు. ఆగస్టులో మాత్రం పొడి పిచ్‌లు ఉంటాయన్నది తన అంచనా అన్నాడు. అది కోహ్లీసేనకే అనుకూలమని తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని