Tokyo Olympics: బాలీవుడ్‌ పాటతో ఇజ్రాయెల్‌ అథ్లెట్ల స్విమ్మింగ్‌! - israeli swimmers dance on bollywood song in olympics
close
Published : 06/08/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: బాలీవుడ్‌ పాటతో ఇజ్రాయెల్‌ అథ్లెట్ల స్విమ్మింగ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో బుధవారం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నిన్న జరిగిన సింక్రనైజింగ్‌ స్విమ్మింగ్‌ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్‌ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ నటించిన ‘ఆజా నచ్‌లే’ చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్‌ అథ్లెట్లు ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బాబ్రిస్కీ ఇద్దరూ జంటగా స్విమ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భారతీయులు ఇజ్రాయెల్‌ అథ్లెట్లు బాలీవుడ్‌ పాటను ఎంచుకోవడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్‌ పాటతో వారు చేస్తున్న ప్రదర్శనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఇజ్రాయెల్‌ ఇన్‌ ఇండియా అనే ట్విటర్‌ పేజీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘బాలీవుడ్‌ సినిమాలంటే ఇజ్రాయెల్‌కు ఎంతో ఇష్టం. మా ఒలింపిక్స్‌ స్విమ్మర్లు ఆజా నచ్‌లే పాటతో పోటీలో పాల్గొనడమే అందుకు నిదర్శనం’’అని పేర్కొంది. అయితే, ఈ పోటీల్లో వారిద్దరు ఫైనల్‌కు చేరుకోలేకపోయినా భారతీయుల హృదయాలను మాత్రం తాకారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. మీరూ ఆ వీడియోని చూసేయండి!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని