వాలంటైన్స్‌డే: కాజల్‌ కపుల్‌ @ శాంతి మెస్‌ - kajal aggarwal visits her favourite mess in pollachi with gautam kitchlu. see pics
close
Published : 15/02/2021 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాలంటైన్స్‌డే: కాజల్‌ కపుల్‌ @ శాంతి మెస్‌

పొల్లాచ్చి: ఎన్నో చిత్రాల్లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్‌ కిచ్లూను ఇటీవలే వివాహం చేసుకుంది. ఆ తర్వాత హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది ఈ జంట. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నూతన దంపతులు ఏ కొత్త ప్రదేశానికో వెళ్లి ఉంటారని నెటిజన్లు అనుకున్నారు. అయితే వీరు పొల్లాచ్చిలోని ‘శాంతి మెస్‌’కు‌ అతిథిలుగా వెళ్లటం విశేషం. వారితో దిగిన ఫొటోలను కాజల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

‘‘నాకెంతో ఇష్టమైన ‘శాంతి మెస్‌’ పొల్లాచ్చిలో ఉంది. ఆ హోటల్‌ యజమానులైన శాంతి అక్క, బాలాకుమార్‌ అన్న మాకు ఎంతో ప్రేమగా భోజనం వడ్డించారు. వారు ప్రేమతో చేసే సర్వీసు వల్లే ఈ మెస్‌ గత 27 సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. నాకు ఈ మెస్‌తో తొమ్మిదేళ్ల అనుబంధం ఉంది’’ అని సోషల్‌మీడియాలో  రాసుకొచ్చింది. అలాగే తన భర్తతో కలిసున్న పెళ్లినాటి ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘మారుతున్న తేదీలు ఎప్పుడూ నీ మీద నాకున్న ప్రేమను తగ్గించలేవు. మనకు రోజూ ప్రేమికుల దినోత్సవమే’ అంటూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం కాజల్‌ చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంతో పాటు, మంచు మనోజ్‌ ‘మోసగాళ్లు’లోనూ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని