ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’ - mandela movie review
close
Published : 08/04/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’

చిత్రం: మండేలా నటీనటులు: యోగిబాబు, షీలా రాజకుమార్‌, సంగిలి మురుగన్‌ దర్శకత్వం: మదొన్నె అశ్విన్‌

సామాజిక సందేశాలు అందించే సినిమాలు తమిళంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇదే కోవలోకి వస్తుంది తమిళ నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా. ఇటీవల ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తక్కువ బడ్జెట్‌దే అయినా, దర్శకుడు అశ్విన్‌ చేతిలో చక్కగా రూపొందింది.

కథ..

తమిళనాడులోని ఓ కుగ్రామంలోని స్థానిక ఎన్నికలే ఇతివృత్తం. హీరో యోగిబాబు ఓ క్షురకుడిగా పొట్టపోసుకుంటుంటాడు. అతనికి సాయంగా ఒక పిల్లాడు ఉంటాడు. ఊర్లోనివాళ్లు యోగిని తమకు ఇష్టమైన పేర్లతో పిలుస్తుంటారు. అన్ని పనులూ చేయిస్తుంటారు. ఆ గ్రామ జనాభా దాదాపు 700 లోపే. ఆ ఊరి పెద్దకు వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు భార్యలు.  గ్రామంలో ఇరు ప్రాధాన్య కులాలు వేర్వేరుగా జీవిస్తుంటాయి. ఊరిపెద్దకు ఇద్దరు కొడుకులు. అంతలో స్థానిక ఎన్నికలకు ప్రకటన వస్తుంది. ఇద్దరు పుత్రులూ ఇరు కులాలకు ప్రతినిధులుగా రంగంలోకి దిగుతారు. ఇంతలో యోగిబాబు తనకు ఆధార్‌కార్డు కావాలని పోస్టాఫీసులో పనిచేసే షీలా రాజ్‌కుమార్‌ను కోరుతాడు. ఆమె అతనికి నెల్సన్‌ మండేలా అని పేరుపెట్టి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేస్తుంది. అనంతరం అతని ఓటు కీలకం కావడంతో ఇరు అభ్యర్థులూ తమకే ఓటు వేయాలని అతని చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఉచిత కానుకలు, హామీలు, బెదిరింపులు, దాడులు జరుగుతాయి. ఇలా అనేక మలుపులు తిరిగిన సినిమా చివర్లో ఉత్కంఠగా ముగుస్తుంది.

ఎవరు ఎలా నటించారు..

యోగిబాబు అనేక సినిమాల్లో కమెడియన్‌గా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా చక్కగా నటించారు. హీరోయిన్‌ షీలా రాజకుమార్‌ తన పాత్రలో ఇమిడిపోయారు. సినిమాలో ప్రస్తుత రాజకీయాలతో పాటు ఒక్క ఓటు కూడా ఎంత కీలకమో అనే అంశాన్ని వివరించారు.

చివరిగా: ఓటు విలువ చెప్పే ‘మండేలా’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని