‘సర్దార్‌’ కోసం భారీ జైలు సెట్ నిర్మాణం - massive jail set constructed for sardar film
close
Published : 08/05/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సర్దార్‌’ కోసం భారీ జైలు సెట్ నిర్మాణం

ఇంటర్నెట్‌ డెస్క్: కార్తి కథానాయకుడిగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌’. ప్రిన్స్‌ పిక్చర్స్‌ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. సినిమాకి సంబంధించి నిర్మాణ సంస్థ చెన్నైలో ఓ భారీ జైలు సెట్‌ని నిర్మించింది. ఇంతటి భారీ సెట్లో పనిచేయడానికి చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. కానీ, ప్రస్తుతం కరోనా రెండో దశ చూస్తుంటే అంతమంది ఒకే చోట చేరి పనిచేయడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్లనే సినిమా షూటింగ్‌ని వాయిదా వేశారు. భవిష్యత్తులో లాక్‌డౌన్, కొవిడ్ కేసుల తీవ్రతను చూసిన తర్వాతే తిరిగి సినిమా షూటింగ్‌ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమా కథ భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఉండనుందని చెప్పుకొంటున్నారు. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ‘సర్దార్‌’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ వీడియోను విడుదల చేశారు. అందులో కార్తి పొడవాటి జుట్టు, గుబురుగా గడ్డంతో కోపంగా చూస్తున్నట్లు ఉంది. కార్తి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. కార్తి ‘సర్దార్‌’ షూటింగ్‌ వాయిదా నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారట. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని