vidya balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! - military firing range named after vidya balan
close
Published : 06/07/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vidya balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..!

దిల్లీ: బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు విద్యాబాలన్‌గా భారత సైన్యం నామకరణం చేసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందిస్తున్న అసాధారణ సేవలకు గుర్తుగా ఆ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరును పెట్టినట్లు ఆర్మీ తెలిపింది. ఆ ప్రదేశం కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఉంది. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ.. ఈ అంశంపై విద్యా ఇప్పటివరకు పెదవి విప్పలేదు. 

ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఆర్మీ నిర్వహించిన వింటర్‌ ఫెప్టివల్‌కు విద్యాబాలన్‌.. ఆమె భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్కార్‌ అవార్డుల పాలకమండలి ‘అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ సైన్సెస్‌’లో చేరాలంటూ ఆమెకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఆమె నటించిన ‘షేర్నీ’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైంది. అందులో ఆమె పోషించిన పాత్రపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని