టెస్టుల భయం: 300 మంది ప్రయాణికుల పరారీ - over 300 passengers flee silchar airport to avoid covid testing after creating ruckus
close
Updated : 22/04/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెస్టుల భయం: 300 మంది ప్రయాణికుల పరారీ

సిల్చార్: ‘‘యావత్ దేశాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే నిబంధనలు పాటించడంతో పాటు స్వల్ప లక్షణాలున్నప్పుడే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే పరిస్థితి విషమించి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది’’ అని ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం టెస్టులకు దూరంగానే ఉంటున్నారు. క్వారంటైన్‌ ఉండాలని భయపడుతున్నారో.. మరేదైనా కారణమో తెలియదుగానీ కొందరు కొవిడ్‌ పరీక్షలంటేనే పారిపోతున్నారు. మొన్నటికి మొన్న బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో టెస్టులను తప్పించుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీయగా.. ఇప్పుడు అస్సాంలోని ఓ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టెస్టులు వద్దని 300 మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి పారిపోయారు.

కరోనా కట్టడిలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కరోనా టెస్టులను తప్పనిసరి చేసింది అస్సాం ప్రభుత్వం. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు చేస్తోంది. బుధవారం సిల్చార్ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టుల నిమిత్తం వైద్య సిబ్బంది ప్రయాణికులను ఆపగా.. కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. పరీక్షలకు ధర రూ. 500 ఉండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ గందరగోళంలోనే ప్రయాణికులు అక్కడి నుంచి పారిపోయారు. 

ఈ విమానాశ్రాయానికి నిన్న ఆరు విమానాల్లో 690 మంది ప్రయాణికులు చేరుకోగా.. 300 మందికి పైగా పరీక్షలు చేయించుకోకుండా పారిపోయారు. మరోవైపు మిగతా ప్రయాణికులకు పరీక్షలు జరపగా.. అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిని ట్రేస్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అస్సాం ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని