డేట్‌కి వెళ్లలేదు: పరిణీతి చోప్రా - parineeti chopra says she has never been on a date
close
Published : 01/03/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డేట్‌కి వెళ్లలేదు: పరిణీతి చోప్రా

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రమోషన్‌లో భాగంగా పరిణీతి చోప్రా తాజాగా ‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

ఫస్ట్‌ కిస్‌, డేట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదు. 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఒకర్ని ముద్దు పెట్టుకున్నాను. అదే నా తొలిముద్దు.’ అని అన్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని పరిణీతి తెలిపారు. అంతేకాకుండా తాను కథానాయికగా నటించిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ తనకి అందిందని.. ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని.. ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆ గిఫ్ట్‌ తనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని