నువ్వలా ఉంటే ఆడుకుంటారు: పూరీ - puri jagannadh about character
close
Published : 09/11/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నువ్వలా ఉంటే ఆడుకుంటారు: పూరీ

హైదరాబాద్‌: పరిస్థితుల్ని బట్టి మారుతూ ముందుకు వెళ్లాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సూచించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘క్యారెక్టర్‌’ అంశంపై మాట్లాడారు. స్థిరంగా ఉండే వ్యక్తంటే సమాజానికి ఇష్టమని, కానీ అలా ఉండకూడదని తనస్టైల్‌లో వివరించారు. 

‘ఒక్కో మనిషికి ఒక్కో క్యారెక్టర్‌ ఉంటుంది. అభిరుచులు, ప్రవర్తన, డ్రెస్సింగ్‌ స్టైల్‌, మాట్లాడే విధానం, రియాక్ట్‌ అయ్యే విధానం.. ఇలా అన్నీ కలిసి ఓ వ్యక్తి క్యారెక్టర్‌ అవుతుంది. ఆ లక్షణాలన్నీ స్థిరంగా ఉంటే అతడి క్యారెక్టర్‌ ఏంటో అందరూ చెప్పగలరు. అలా స్థిరంగా ఉండేవాడంటేనే సమాజానికి ఇష్టం. ఎందుకంటే వాడిని అంచనా వేయడం సులభం. ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతాడో చెప్పొచ్చు. అంచనా వేయలేకుండా ఉంటే.. ‘వాడికి క్యారెక్టర్‌ లేదురా’ అంటారు. ‘నాకు తెలుసు అయ్యగారు.. మీరు మాటిస్తే అంతే.. ప్రాణమైనా వదులుకుంటారు కానీ మాట తప్పరు’ అని అంటుంటారు. దీనర్థం మీ క్యారెక్టర్‌ని ఫిక్స్‌ చేసి అలాగే ఉండమని మీకు గుర్తు చేస్తూ.. మీతో ఆడుకుంటున్నాడని. ఇలాంటి మాటలు వింటూ ఇతరుల కోసం అదే క్యారెక్టర్‌తో బతికావో నీతో ఆడుకుంటారు’.

‘ఎందుకంటే నీకు కోపం, ఆనందం వస్తే ఏం చేస్తావో వాళ్లకు తెలుసు? అందుకే అందరూ నీ క్యారెక్టర్‌ను వర్ణిస్తూ.. ఆ వర్ణనతో ఓ ఫ్రేమ్‌ కట్టి, గోడకు మేకేసి కొడతారు. నిజమైన మనిషికి క్యారెక్టర్‌ ఉండదు. ఎందుకంటే రోజూ ఎన్నో చూస్తుంటాం, నేర్చుకుంటుంటాం, మారుతూ ఉంటాం. మన శరీరం, కండలు, ఎముకలు మారుతూ ఉంటాయి. వీటితోపాటు మన క్యారెక్టర్‌ కూడా మారుతూ ఉంటుంది. అలా ఉంటేనే.. మనం జీవితంలో నేర్చుకోగలుగుతాం. జీవితాన్ని ఇంకా బాగా ఎంజాయ్‌ చేయగలం. మనల్ని ఎదుటి వ్యక్తి అంచనా వేసేలా ఉండొద్దు.. ‘నాకు ఏదైనా జరిగితే నువ్వు వాడిని చంపేస్తావు బావా. నీ గురించి నాకు తెలుసు’ అని ఎవరైనా అంటే.. ‘నేను చంపను. నేను ఇంతకు ముందులా లేను. రోజురోజుకీ నా క్యారెక్టర్‌ మారిపోతోంది. నేను ఏం చేస్తానో నాకే తెలియదు’ అని చెప్పండి’.

‘కాబట్టి ఎలాంటి క్యారెక్టర్‌ నీకు ఉండకూడదు. నీ క్యారెక్టర్‌ ఏంటో ఎవరికీ తెలియకూడదు, నీకు కూడా తెలియకూడదు. నేర్చుకుంటూ, మారుతూ.. ముందుకు వెళ్లాలి. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఊహించని విధంగా ఉండాలి, రియల్‌ మెన్‌లా ఉండండి. రియల్‌ మెన్‌ ఎప్పుడూ మారుతూ, అలర్ట్‌గా ఉంటాడు..’ అని పూరీ సందేశం ఇచ్చారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని