జబర్దస్త్‌ కమెడియన్స్ కన్నీటి గాథలివి - real stories of jabardasth comedians
close
Published : 18/06/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జబర్దస్త్‌ కమెడియన్స్ కన్నీటి గాథలివి

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కార్యక్రమాల వేదికగా తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు పలువురు కమెడియన్స్‌. అలా, ప్రతి గురు, శుక్రవారాలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తోన్న హాస్యనటుల జీవితాల్లో ఉన్న కన్నీటి గాథలు తెలియజేస్తుంది ఈ వారం ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలో వచ్చే వారం ‘ఫాదర్స్‌ డే’ స్పెషల్‌గా ‘నాన్నకు ప్రేమతో..’ ప్రసారం కానుంది. ఇందులో భాగంగా కెవ్వు కార్తిక్‌, ఇమ్మానుయేల్‌.. మరి కొంతమంది హాస్యనటులు.. తమ కన్నీటి కథలు, నాన్న గొప్ప తనాన్ని గురించి తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జూన్‌ 20న ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చూడాల్సిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని