అమెజాన్‌ ప్రైమ్‌లో ‘సైనా’ వచ్చేస్తోంది! - saina to release on amazon prime video on april 23
close
Updated : 16/04/2021 23:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌లో ‘సైనా’ వచ్చేస్తోంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా అమోల్‌ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైనా’. పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్‌ పోషించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా సైనా పాత్ర కోసం పరిణీతి పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ ప్రతిబింబించింది. కాగా, త్వరలోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నెటిజన్లను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి ‘సైనా’ను అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరికీ ‘సైనా’ అందుబాటులోకి వస్తుండటంపై పరిణీతి సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో మైలు రాయిలాంటి చిత్రమని ఆమె అన్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని