శిల్పాశెట్టి కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ - shilpa family effected to covid
close
Published : 08/05/2021 09:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శిల్పాశెట్టి కుటుంబ సభ్యులకు పాజిటివ్‌

ముంబయిని కరోనా చుట్టుముడుతున్న వేళ సినీ తారలూ దాని బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక శిల్పాశెట్టి కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. శిల్పకు మాత్రం నెగెటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం వెల్లడించారు. ‘‘పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మా అత్తమామలు, అమ్మ, నా భర్త కొవిడ్‌ బారిన పడ్డారు. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ వైద్యుల సలహాలు తీసుకుంటూ చికిత్స పొందుతున్నారు. మా పనివాళ్లలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వాళ్లు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు’’అని చెప్పారు. ‘‘నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ, మద్దతులకు కృతజ్ఞతలు. అందరూ మాస్క్‌ ధరించండి. శుభ్రత పాటించండి. కొవిడ్‌ పాజిటివ్, నెగెటివ్‌ ఏది వచ్చినా మీరు మానసికంగా పాజిటివ్‌గానే ఉండండి’’అంటూ అభిమానులకు హితవు పలికారు శిల్ప.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని