‘కాటుక కనులే మెరిసిపోయే...’ - suriya birthday special song from Aakasam Nee Haddhu Ra
close
Updated : 24/07/2020 06:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కాటుక కనులే మెరిసిపోయే...’

హైదరాబాద్: సూర్య. పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ మార్కెట్‌ను ఏర్పరచుకున్న నటుడు. పాత్ర కోసం తనను తాను మార్చుకునే అతి కొద్దిమంది నటుల్లో సూర్య కూడా ఒకరు. సుధ కొంగర దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా!’. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు ఆర్‌.గోపీనాథ్‌ జీవితకథను సినిమా తెరకెక్కిస్తున్నారు.

గురువారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని  ‘కాటుక కనులే..’ అంటూ సాగే గీతం ప్రోమోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. అపర్ణా బాలమురళితో సూర్య కెమెస్ట్రీ అభిమానులను అలరిస్తోంది. జీవీ ప్రకాష్‌ అందించిన స్వరాలకు తెలుగులో భాస్కరభట్ల సాహిత్యం అందించారు. దీక్షిత వెంకటేశన్‌(దీ..) ఆలపించారు. ఈ పాట రాసే అవకాశం ఇచ్చినందుకు భాస్కరభట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌, పరేశ్‌రావల్‌, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

దీంతో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో సూర్య ‘వాడివసల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. మెడలో తాడు, పులిగోరు, బనియన్‌తో సూర్య కనిపించగా, వెనుక హరప్పా , సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మలు కనిపించడం విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని