Shiva Shankar: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ కోసం రంగంలోకి దిగిన సోనూసూద్‌ - telugu news actor sonusood about shiva shankar master health
close
Published : 25/11/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shiva Shankar: కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ కోసం రంగంలోకి దిగిన సోనూసూద్‌

హైదరాబాద్‌: కరోనాతో పోరాడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌కు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్‌ ముందుకు వచ్చారు. కరోనా కారణంగా శివశంకర్‌ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకగా.. ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వైద్య చికిత్సకు డబ్బు సర్దుబాటు చేయడంలో శివశంకర్‌ కుటుంబసభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బుధవారం రాత్రి నెట్టింట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకొన్న సోనూసూద్‌.. వెంటనే స్పందించారు. శివశంకర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

శివశంకర్‌ మాస్టర్‌ గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ‘దొంగా దొంగది’ చిత్రంలో ఆయన కంపోజ్‌ చేసిన ‘మన్మథ రాజా’ పాటకు విపరీతమైన క్రేజ్‌ లభించింది. ‘అరుంధతి’, ‘మగధీర’, ‘బాహుబలి’ చిత్రాల్లోని పలు పాటలకు ఆయన నృత్యాలు సమకూర్చారు. ఆయన కేవలం డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా పలు సినిమాల్లో నటించారు కూడా. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘నిను వీడని నీడను నేనే’, ‘రాజుగారి గది-3’ల్లో ఆయన సహాయ నటుడిగా మెప్పించారు.

Read latest Cinema News and Telugu News


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని