Devineni Uma Maheswara Rao: దేవినేని బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు - telugu news devineni uma bail petition
close
Published : 03/08/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Devineni Uma Maheswara Rao: దేవినేని బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

అమరావతి: కృష్ణాజిల్లా జి.కొండూరులో తనపై నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తవటంతో నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్‌ ఏ నేరానికి పాల్పడలేదని ఉమా తరఫు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదు దారు ఎవరో.. అతను ఏ సామాజిక వర్గమో తెలియదని వివరించారు. కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్థులు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకెళ్లటంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారని న్యాయవాది తెలిపారు. కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతుందని, మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వటం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయం కోసం రేపటికి వాయిదా వేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని