Jai Bhim: లాయరుగా సూర్య పోరాటం.. ‘జై భీమ్‌’ ట్రైలర్‌ చూశారా! - telugu news jai bhim trailer suriya
close
Published : 22/10/2021 22:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jai Bhim: లాయరుగా సూర్య పోరాటం.. ‘జై భీమ్‌’ ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతనో న్యాయవాది. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాటం చేశాడు. కోర్టులో న్యాయం దక్కకపోతే రోడ్డుపైకి వెళ్లి పోరాడేందుకు సిద్ధపడ్డాడు. అతడు అండగా నిలిచిన కుటుంబం ఎవరిది? వాళ్లకి న్యాయం జరిగేందుకు ఎలా పోరాటం చేశాడు? తెలియాంటే ‘జై భీమ్‌’ చూడాల్సిందే. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఇందులో ఆయన లాయరుగా నటించారు. ఈ సినిమాను సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదలైంది.

‘పోరాడదాం.. పోరాడదాం.. న్యాయం దక్కే వరకూ పోరాడదాం’, ‘లా.. శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడేందుకు దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అని సూర్య చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఒదిగిపోయారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేష్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని