‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’ - us restaurent introduced no mask policy
close
Published : 25/02/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’

అమెరికన్‌ రెస్టారంట్‌ ప్రకటనపై విమర్శలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు సాధారణ జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మాస్క్‌ ధరించడం అందరికి అలవాటైపోయింది. బయటకు వస్తే చెప్పులు వేసుకోవడం ఎంత సాధారణమో.. మాస్కు ధరించడం అంతే సర్వ సాధారణమైంది. అయినా కొంత మంది మాస్క్‌లు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారుంటారు. అలాంటి వారి కోసమే కిరాణా దుకాణం నుంచి.. షాపింగ్‌మాల్స్‌ వరకు అన్ని చోట్ల ‘నో మాస్క్‌ - నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తుంటాయి. ప్రభుత్వాలు సైతం మాస్క్‌ ఉంటేనే కస్టమర్లను లోపలకి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చాయి. కానీ, అమెరికాలో ఓ రెస్టారంట్‌ మాత్రం ఆ నిబంధనలను గాలికి వదిలేయడమే కాదు.. మాస్కే అవసరం లేదు.. అందరూ రావొచ్చని బోర్డు పెట్టింది. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం అమెరికాలో కరోనా రెండో దఫా ఉద్ధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలకు మాస్కులు పంపిణీ చేయనున్నట్లు స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా ప్రకటించారు. అమెరికాలో మాస్కులు ధరించడం ఎంత అవసరమో ఈ ప్రకటనే తెలియజేస్తుంది. అలాంటిది.. ఫ్లోరిడాలోని హర్నెండో కౌంటీలో ఉన్న బెక్కీజాక్స్‌ ఫుడ్‌షాక్‌ రెస్టారంట్‌.. మాస్క్‌ లేకుండానే రెస్టారంట్‌కు రావొచ్చని ఇటీవల ప్రకటించింది. మాస్క్‌లను డైపర్లుగా సంబోధిస్తూ... ‘ఫేస్‌ డైపర్లు అవసరం లేదు! అందరికి స్వాగతం’’అని రెస్టారంట్‌ ముందు బోర్డు పెట్టింది. సోషల్‌మీడియాలోనూ దీన్ని పోస్టు చేసింది. దీంతో కస్టమర్లు.. నెటిజన్లు రెస్టారంట్‌ తీరుపై మండిపడుతున్నారు. కరోనా సోకుతుందేమోనని అందరూ భయపడుతుంటే.. ఈ రెస్టారంట్‌ అసలు మాస్క్‌ అవసరం లేదనడం బాధ్యతారాహిత్యమని విమర్శిస్తున్నారు. ఇలా చేస్తే.. కరోనా సులభంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం రెస్టారంట్‌కు మద్దతు పలుకుతున్నారు. ఎలాగూ ఆహారం తినడానికి మాస్క్‌ తీసేస్తాం. అలాంటప్పుడు రెస్టారంట్‌లోకి మాస్క్‌ పెట్టుకొని ఎందుకు వెళ్లడం అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. రెస్టారంట్‌ తీరుపై మాత్రం ఎక్కువగా విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ రెస్టారంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుందా.. లేదా? అనేది తెలియలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని